Normal nail - నిరూపణాతీత (సాధారణ)https://en.wikipedia.org/wiki/Preventive_healthcare
గోరు లేదా నఖం (Nails) కాలి, చేతి వేళ్ళకు చివర భాగం నుండి పెరిగే కొమ్ము (Horn) వంటి గట్టి నిర్మాణాలు. గోర్లు కెరటిన్ (Keratin) అనే ప్రోటీన్ తో చేయబడివుంటాయి. మాతృగర్భంలో ఆకృతి దాల్చుకున్న పిండం 9వ వారంలోనే గోళ్లకు అంకురాలు పడతాయి. 15వ వారానికల్లా గోళ్ల పెరుగుదల ఆరంభమవుతుంది. ఇక అక్కడి నుంచీ జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పెరుగుదల పసిబిడ్డల్లో నెమ్మదిగా మొదలై వయసుతో పాటు క్రమేపీ వేగం పుంజుకుంటుంది. ఈ వేగం 20ల్లో, 30ల్లో అత్యధికంగా ఉంటుంది, 50ల తర్వాత ఒక్కసారిగా నెమ్మదిస్తుంది. కాలి గోళ్ల కన్నా చేతిగోళ్లు త్వరగా పెరుగుతాయి. కాలి గోళ్లు నెలకు 1 మిల్లీ మీటరు పెరిగితే చేతిగోళ్లు 3 మిల్లీ మీటర్ల వరకూ పెరగొచ్చు. చేతిగోరు మొదలు నుంచి చివరి వరకూ పెరగటానికి 100-180 రోజులు పడుతుంది, కాలిగోరు 12-18 నెలలు తీసుకుంటుంది. పోషకాహార లోపం, శారీరక వ్యాధులు, కాళ్లూ చేతులకు రక్తనాళ సమస్యల వల్ల గోళ్ల పెరుగుదలలో వేగం తగ్గొచ్చు. క్యాన్సర్‌ మందులతోనూ వేగం తగ్గొచ్చు. గర్భిణులకు, సోరియాసిస్‌ బాధితులకు వేగంగా పెరుగుతాయి.
☆ జర్మనీ నుండి 2022 Stiftung Warentest ఫలితాలలో, ModelDermతో వినియోగదారు సంతృప్తి చెల్లింపు టెలిమెడిసిన్ సంప్రదింపుల కంటే కొంచెం తక్కువగా ఉంది.